కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపెడుతోంది. దీంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆ వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. అయితే కరోనా ఉన్నప్పటికీ భయపడాల్సిన పనిలేదని, దాన్ని సులభంగా అధిగమించవచ్చని ఓ మహిళ చెబుతోంది. ఆమె కరోనా బారిన పడి కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి డిశ్చార్జి అయింది. ఈ క్రమంలోనే ఆ మహిళ తాను కరోనా నుంచి ఎలా బయట పడిందీ సొంత అనుభవంతో చెబుతోంది. ఇంతకీ ఆమె ఏం చెబుతున్నదంటే…
అమెరికాలోని సీటెల్‌కు చెందిన 37 ఏళ్ల ఎలిజబెత్ ష్నయిడర్ అనే మహిళకు ఇటీవల కరోనా సోకింది. ఆమె ఓ పార్టీకి హాజరు కాగా అక్కడ ఆమెకు కరోనా వ్యాపించింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఆమె ఎలా ఆ వైరస్‌ను ఎదుర్కొన్నదీ.. ఆమె సొంత మాటల్లో తెలుసుకుందాం…
”కొద్ది రోజుల కిందట జరిగిన ఓ చిన్న హౌస్ పార్టీకి వెళ్లా. అక్కడ ఎవరూ నాకు దగ్గుతూ కనిపించలేదు. కనీసం వారిలో ఎవరికీ జలుబు ఉన్నట్లు నాకు తెలియదు. కానీ ఎవరి వల్లో నాకు కరోనా వ్యాపించింది. ఆ తరువాత రోజు నుంచీ మొదటి 3 రోజుల వరకు తలనొప్పి, జ్వరం వచ్చాయి. తరువాత 3 రోజుల పాటు ఆ లక్షణాలు అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉండేవి. అయితే ఆ తరువాత తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ప్రారంభమయ్యాయి. తీవ్రమైన అలసటగా అనిపించింది. 103 డిగ్రీల జ్వరం ఉండేది. తరువాత అది నెమ్మదిగా 100 నుంచి 99.5కు చేరుకుంది. ఆ తరువాత నాకు బాగా వికారంగా అనిపించింది. దీంతో మెడికల్ షాపుకు వెళ్లి ఫ్లూ మందులు తెచ్చి వేసుకున్నా.. అయితే కొద్ది రోజులు ఆగాక అవే లక్షణాలు మళ్లీ వచ్చాయి. దీంతో హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకుంటే కరోనా అన్నారు. అప్పటి నుంచి సుమారుగా 14 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్నా. కరోనా తగ్గింది. ఇంటికి డిశ్చార్జి చేశారు. అయినప్పటికీ నన్ను బయటకు వెళ్లకూడదని, ఇతరులు ఎవరినీ కలవకూడదని చెప్పారు. నేనూ అదే చేస్తున్నా.. నమ్మండి.. కరోనాకు భయపడాల్సిన పనిలేదు. లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోండి. కొద్ది రోజులు అందరికీ దూరంగా ఉండండి.. అంతే కరోనా తగ్గుతుంది..!”
కాగా ఎలిజబెత్ ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయడంతో అదిప్పుడు వైరల్‌గా మారింది. ఏది ఏమైనా.. కరోనా ఉందని చెప్పి ఎవరూ భయాందోళనలకు గురి కావల్సిన పనిలేదు. లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోండి. కరోనా అదే తగ్గుతుంది..!