ఎలన్ మస్క్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ కుబేరుడిగానే కాకుండా.. టెస్లా కార్లతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు వ్యూహాలు కూడా రచించారు. అయితే తాజాగా ఆయన సంబంధించిన ఫోటోల నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ప్రత్యేక లగ్జరీ యాచ్ లో సముద్ర తీరంలో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఎలన్ మస్క్ నీటిలో ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతున్న ఫొటోలు, ఆయన తోపాటు స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ సారా స్టాడింజర్, ఆమె భర్త అరి ఎమ్మాన్యుయేల్, మరి కొందరు కూడా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.
మస్క్ నలుపు రంగు స్విమ్మింగ్ షార్ట్ వేసుకుని, పైన బనియన్, చొక్కా వంటివేమీ లేకుండా తచ్చాడుతున్న ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కామెంట్లు మొదలుపెట్టారు. “హతవిధీ ఇవాళ ఎలన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాయ్ చేస్తున్న మస్క్, ఆయన స్నేహితులను చూడండి” అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు.
‘‘ట్విట్టర్ తో 44 బిలియన్ డాలర్ల లీగల్ పోరాటం చేస్తున్న వేళ కూడా ఏ మాత్రం బాధ లేకుండా ఇలా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ‘‘ఎలన్ నాకు నచ్చారు. నేను నా డబ్బంతా ఈయన వద్ద పెట్టుబడి పెడతాను”అని మరో ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయగా.. ఎలన్ మస్క్ స్పందించారు. “ఇదేదో బాగుంది.. నేను తరచూ షర్ట్ లేకుండా కనిపిస్తూ ఉండాల్సింది…” అని పేర్కొన్నారు.