వరల్డ్ రిచేస్ట్ మ్యాన్ ఎలాన్‌మస్క్ నిమిషానికి సుమారు 6,887 డాలర్లను(రూ.5.71 లక్షలకు పైగా) సంపాదిస్తున్నారని ఫిన్‌బోల్డ్ డేటా తెలిపింది.అదే వారానికి 69,420,960 డాలర్లు(రూ.576 కోట్లకు పైగా) ,రోజుకు 9,917,280 డాలర్లు(రూ.82.35 కోట్లు),గంటకు 413,220 డాలర్లు(రూ.3.43 కోట్లకు పైగా) సంపాదిస్తున్నట్లు ఫిన్‌బోల్డ్ వెల్లడించింది. ఫిబ్రవరి 2024 మధ్య నాటికి ఎలాన్‌మస్క్ సంపద విలువ $198.9 బిలియన్లుగా ఉంది. మస్క్ మొత్తం ఆస్తులను పరిగణలోకి తీసుకుని ఈ డేటాను అందించినట్లు ఫిన్‌బోల్డ్ పేర్కొంది.
మస్క్‌కు టెస్లాలో 20.5 శాతం, ఎక్స్‌లో 90 శాతానికి పైగా,స్టార్‌లింక్‌లో 54 శాతం, స్పేస్‌ఎక్స్‌లో 42 శాతం, వాటా ఉంది. వీటితో పాటు xAIలో 25 శాతం, న్యూరాలింక్‌లో 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. వరల్డ్ లోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఎలాన్‌మస్క్ $198.5 బిలియన్లతో రెండో స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ $219.1 బిలియన్లతో మొదటి స్థానంలో ఉన్నారు.