శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్లు వెంటనే హైదరాబాద్ ATC నుండి అనుమతి తీసుకున్నారు. ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా విమానాన్ని పైలెట్ ల్యాండ్ చేశారు.
విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలాఉండగా, ఈ మధ్యకాలంలో రోజుల వ్యవధిలోనే మూడు విమానాలు ప్రమాదానికి గురవ్వడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కజకిస్తాన్, సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదాలు విమాన ప్యాసింజర్స్‌ను భయాందోళనకు గురిచేస్తున్నాయి.