జమ్మూ కాశ్మీర్‌లోని నాగ్రోటాలో నలుగురు ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్ ని భారత ఆర్మీ బలగాలు అడ్డుకోవడం ఆ తర్వాత కాల్పులకు దిగడం వంటివి జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఇక వీరికి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి అని ఇండియన్ ఆర్మీ చెప్పింది. వీరు పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉన్న ఉగ్రవాద నాయకులతో చర్చిస్తున్నారు.
జైష్-ఇ-మొహమ్మద్ (జెఎమ్) ఉగ్రవాదులు అని… పంజాబ్‌లోని షకర్‌గర్ లోని హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని… పాకిస్తాన్లోని నారోవల్ జిల్లాకు చెందిన వారు అని ఆధారాలు చూపించారు. నాగ్రోటాలో మరణించిన నలుగురు ఉగ్రవాదుల నుండి పాకిస్తాన్ కంపెనీ ‘మైక్రో ఎలక్ట్రానిక్స్’ మరియు క్యూమొబైల్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ తయారు చేసిన డిజిటల్ మొబైల్ రేడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.