లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మే 14 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా ఎమ్మెల్సీ కవితకు షాక్ తో పాటు కాస్త ఊరటనిచ్చింది కోర్టు. కస్టడీలో ఉన్న కవితను ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించింది. కవిత పై వారం రోజుల్లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ న్యాయస్థానం ఆమెకు బెయిల్ ను నిరాకరించడంతో వారు షాక్ కు గురయ్యారు.