ఎన్ కౌంటర్.. తెలంగాణ వాసి సందె గంగయ్య మృతి!

-

విశాఖ: ఏజెన్సీలో తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పీఎస్‌ పరిధిలో ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. తెల్లవారుజామున గ్రేహౌండ్స్‌ దళాలు, మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. కాగా ఏజెన్సీలో కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్‌లో తెలంగాణ వాసి సందె గంగయ్య మృతి చెందినట్లు తెలుస్తోంది. డీసీఎం కమాండర్‌గా సందె గంగయ్య ఉన్నారు. సందే గంగయ్య వద్ద ఏకే 47 లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులతో ఏజెన్సీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూబింగ్‌ను ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి,  ఒడిషా బలగాలను కూడా అప్రమత్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version