ప్ర‌ధాని మోడీ పై ప్ర‌శంస‌లు కురిపించిన ఇంగ్లాండ్ క్రికెట‌ర్

-

భార‌త ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ పై ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల ఆఫ్రిక దేశాల అల్లాడుతుంటే.. ప్ర‌ధాని మోడీ చేసిన సాయం గొప్పద అని అన్నారు. కాగ ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఆఫ్రీకా దేశాల లో ఓమిక్రాన్ వేరియంట్ తో వ‌ణికి పోతున్న స‌మ‌యం లో భార‌త ప్ర‌ధాని మోడీ సాయం చేయ‌డం సంతోషమ‌ని అన్నారు.

అయితే ఓరియంట్ వేరియంట్ తో ఆఫ్రీకా దేశాలు ఎంతో దెబ్బ తింటుంది. దీంతో ఆఫ్రీకా దేశాల‌కు సాయం చేయాల‌ని భార‌త్ ముందుకు వ‌చ్చింది. అందు కోసం ఒక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ఆ ప్ర‌క‌ట‌న కు రీ ట్వీట్ చేస్తూ.. ప్ర‌ధాని మోడీ ని ప్ర‌శంసించాడు. భార‌త్ మ‌రోసారి ఆ కేరింగ్ స్పిరిట్ చూపింద‌ని అన్నారు. అందుకే చాలా మంది హృద‌య‌పూర్వ‌క వ్య‌క్తు ల తో అత్యంత అద్భుత మైన దేశంగా నిలిచింద‌ని ట్విట్ట‌ర్ వేదిక గా అన్నాడు. అలాగే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కి ధ‌న్య‌వాదాలు అని కేవిన్ పీట‌ర్స‌న్ ట్విట్ లో రాశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version