ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: సబితా ఇంద్రారెడ్డి

-

ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభిస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చించారు.రాష్ట్రంలో జూన్ 12 కల్లా మన ఊరు -మన బడి అమలుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.మొదటి దశలోనే 50 శాతం పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించేలా బడిబాట కార్యక్రమం చేపడతామన్నారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్యాబోధన, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కు అధికారులంతా కృషిచేయాలని మంత్రి తెలిపారు.వేసవి సెలవులు ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తిచేసి పాఠశాలలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే ల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు పనులను పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version