ఆ ఏటీఎంలో 100 ఎంటర్ చేస్తే 500…!

-

బ్యాంక్ కస్టమర్లకు రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు వచ్చాయి ఒక ఏటీఎంలో. ఉచితంగా వచ్చే డబ్బులు కావడంతో జనాలు ఆ ఏటీఎం ముందు బారులు తీరిమరీ ఆ డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం కెనరా బ్యాంకు ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రమైన మడికేరిలో ఏటిఎంలో కస్టమర్లు వంద రూపాయలు తీసుకుందామని చూడగా,

రూ 500 నోట్లు రావడంతో అక్కడ పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఆ ఏటీఎంలో నిమిషాల వ్యవధిలో దాదాపు 2 లక్షల వరకు విత్ డ్రా చేసారు. ఏటీఎంలో రూ.100 బదులు రూ.500 నోట్లు రావడానికి కారణం ఏంటీ అంటే, ఏటీఎం క్యాష్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ పొరపాటు పడటమే, ఏటీఎం నగదు ట్రేలో రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లను ఉంచారు. దీంతో రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు వచ్చేశాయి.

దీనిని గమనించిన కొందరు వ్యక్తులు నిజాయితీగా ఏటీఎంలో రూ.500 నోట్లు వస్తున్న విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లడ౦తో వెంటనే స్పందించిన బ్యాంకు, దిద్దుబాటు చర్యలు తీసుకుని, బ్యాంకు అధికారులు డబ్బు డ్రా చేసినవారిని గుర్తించి వారిని సంప్రదించారు. చాలా వరకు డబ్బులను అధికారులకు తిరిగి ఇచ్చేసారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం ఉచితంగా వచ్చిన సొమ్ము ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీనితో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version