దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా దుర్గగుడి ఈవో భ్రమరాంబ

-

దేవాదాయ శాఖపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేవాదాయ శాఖలో జరుగుతున్న పరిణామాలపై సీరియస్‌గా పరిగణించింది. ఈ మేరకు ఆ శాఖలో బదిలీలకు తెరలేపింది. తాజాగా పలువురు దేవాదాయశాఖ అధికారులను బదిలీ చేసింది. విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబను దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. విజయవాడ దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు నియామకమయ్యారు. దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌కు అన్నవరం ఈవోగా బాధ్యతలు అప్పగించారు. అన్నవరం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తిరుపతి రీజినల్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15 నుంచి మొదలు కానుండగా.. ఆకస్మికంగా ఆలయ ఈవోని ప్రభుత్వం బదిలీచేయడం చర్చనీయాంశం అయ్యింది. దేవాదాయశాఖ అధికారి భ్రమరాంబను బదిలీచేసి.. ఆమె స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను నియమించారు. అలాగే నలుగురు డిప్యూటీ కలెక్టర్ల కూడా బదిలీ అయ్యారు. నలుగురికి పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్వోగా బదిలీచేశారు. కృష్ణా జిల్లా డీఆర్వో పి.వెంకటరమణను బాపట్ల డీఆర్వోగా బదిలీ చేశారు. సెప్టెంబరు మొదటివారంలో ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వోగా పోస్టింగ్‌ పొందిన ఎం.శ్రీనివాస్‌.. ఆ పోస్టులో చేరలేదు. తాజాగా ఆయన్ను దుర్గగుడి ఈవోగా నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వోగా ఎస్వీ నాగేశ్వరరావును నియమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version