ఈపీఎఫ్ఓ అలెర్ట్.. ఉద్యోగులూ ఒకసారి వినాల్సిందే మరి..!

-

ఈ మధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ప్రజల డబ్బును దోచుకోవడానికి సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడూ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. దీనితో చాలా మంది కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు EPFO సబ్‌స్క్రైబర్ల ఖాతాలపై కూడా కన్ను వేశారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం పై పీఎఫ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారుల పరంగా, చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరంగా ప్రపంచం లోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటిగా ఉంది.

సంస్థ చందాదారులకు సహాయం చేస్తున్నారు. అలానే ప్రయోజనాల కోసం వివిధ రకాల సేవలను అందిస్తోంది కూడా. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలని EPFO సభ్యులకు సహాయపడేందుకు అందరికీ తాజా హెచ్చరికను జారీ చేసింది. EPFO ఆన్‌లైన్ స్కామ్ హెచ్చరికను రిలీజ్ చేసింది. UAN/ పాస్‌వర్డ్/ పాన్/ ఆధార్/ బ్యాంక్ ఖాతా వివరాలు/OTP లేదా ఏదైనా పెర్సనల్ డీటెయిల్స్ ని ఎవరికీ షేర్ చెయ్యద్దని చెప్పింది.

EPFO లేదా సంస్థ సిబ్బంది ఈ వివరాలను సందేశాలు, కాల్‌లు, ఈ-మెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఎవరూ అడగరు సో చెప్పద్దని హెచ్చరించింది. ఫేక్ కాల్స్/మెసేజ్‌ల పట్ల జాగ్రత్త ఉండాలి. ఒకవేళ కనుక ఏమైనా కాల్స్, లేదా మెస్సెజ్ లు వస్తే స్థానిక పోలీసు/సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు కంప్లైంట్ చెయ్యమని చెప్పింది. అలానే మొబైల్స్ కి వచ్చే ఫేక్ లింక్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలని అంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version