రేవంత్‌రెడ్డి మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పని ఖతమైపోతుందని అన్నారు. ఆయన ఏ పార్టీలో అడుగుపెట్టినా ఆ పార్టీ బలహీనమవుతుందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. టీడీపీని కూడా బలహీనపరిచింది రేవంత్ అని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన వెంట పార్టీ కార్యకర్తలెవరూ లేరని ఎర్రబెల్లి అన్నారు. హుందాతనాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్న రేవంత్ కు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి తప్పు చేసిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. రేవంత్ రెడ్డి తన కామెంట్లతో నక్సలైట్లను సపోర్ట్ చేశాడా? లేక రెచ్చగొట్టాడా అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి.

ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. నక్సలైట్ ఎజెండా వేరు నక్సల్స్ ను పేల్చమనడం వేరన్న విషయాన్ని రేవంత్ తెలుసుకోవాలని సూచించారు మంత్రి ఎర్రబెల్లి. ఒక బ్రోకర్, బ్లాక్ మెయిలర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్‌ను డైనమైట్లతో పేల్చేయాలన్న రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, మంగళవారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ములుగులో ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్ ఎందుకని.. దానిని నక్సలైట్లు డైనమైట్లు పెట్టి పేల్చాయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపడంతో బీఆర్ఎస్ నేతలు రేవంత్‌పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version