సీఎం కేసీఆర్‌ చరిత్ర స్పష్టించారు : మంత్రి ఎర్రబెల్లి

-

నేడు ములుగు జిల్లాలో జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119కి 115 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్‌ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయని అన్నారువెల్లడించారు. జూన్‌ నెలలో లో మరణించిన దివంగత జడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ కుటుంబ సభ్యులకు మంత్రులు, కార్యకర్తల సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సమకూర్చిన రూ.కోటి 50లక్షల విలువైన చెక్కును అందించారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెండేళ్లకోసారి రూ.100 కోట్లతో సమ్మక్క-సారలమ్మ జాతరలను ఘనంగా నిర్వహిస్తోందని, మేడారం వనదేవతల పేర్లు పలికే అర్హత కూడా బీజేపీ, కాంగ్రెస్‌ లకు లేదని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు ఏమి చేసింది అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీరమళ్ల ప్రకాశ్‌, రెడ్‌కో చైర్మన్‌ ఏరువ సతీశ్‌రెడ్డి, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థులు బడే నాగజ్యోతి, తెల్లం వెంకట్‌రావు, ఇతర బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హాజరయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version