ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు హైకోర్టులో ఝలక్‌..

-

తెలంగాణ లోని తుంగతుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గాదరి కిశోర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. గాదరి కిశోర్ ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆ పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గాదరి కిశోర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అద్దంకి దయాకర్ పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టులో గాదరి కిశోర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్ స్వీకరణపై హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. గాదరి కిశోర్ వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇది ఇలా ఉంటె , అనూహ్యంగా హైకోర్టు గాదరి కిషోర్ పిటిషన్‌నే డిస్మిస్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు సాక్ష్యుల లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version