BRS, కాంగ్రెస్ రెండు ఒక్కటే ఇది ప్రజలు గమనించాలని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 30 నుంచి 40 శాతం మందికి టికెట్ రాదని ప్రచారం జరుగిందని.. కానీ భయపడి ఒకే సారి 115 మంది టికెట్లు ప్రకటించారని కేసీఆర్ పై మండిపడ్డారు ఈటల రాజేందర్. దశాబ్ది ఉత్సవాల పేరుతో నేరుగా కలెక్టర్లే డబ్బులు డ్రా చేసి దావత్ లు చేశారని.. కేసీఆర్ ఇచ్చే హామీలు బోలెడు అంటూ ఎద్దేవా చేశారు.
బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది BRS లోకి గుంజుకున్నారని ఆగ్రహించారు ఈటల రాజేందర్. కుక్కలాగా ఒర్రె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిల్లులను చేసినం అని ఓ ఎమ్మెల్సీ అంటున్నారని… కాంగ్రెస్ వాళ్ళను ఏమనకండి వాళ్ళు మనవాల్లే అని ఇంకో ఎమ్మెల్యే అంటున్నారని పేర్కొన్నారు. వాళ్ళు మన కోవర్తులే మనమే గెలిపించి మన పార్టీలోకి తీసుకోస్తాం అంటున్నారు… BRS, కాంగ్రెస్ రెండు ఒక్కటే ఇది ప్రజలు గమనించాలని కోరారు ఈటల రాజేందర్.