బిజెపిలోకి ఈటెల జంప్…?

-

తెలంగాణా రాజకీయాల్లో దాదాపుగా నెల రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర బిజెపిలో జాయిన్ అవుతారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఈ నేపధ్యంలో బిజెపి కీలక నేతలు ఆయనపై ఫోకస్ పెట్టారు. ఈటలకు బీజేపీ గాలం వేయడం మొదలుపెట్టింది. మాజీమంత్రి ఈటలతో బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ చర్చలు జరుపుతున్నారు.

నగర శివారులోని ఒక ఫాంహౌస్ లో ఈటలతో జరిగిన సమావేశంలో భూపేందర్ యాదవ్ తో కలసి పాల్గొన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి… ఈటెలను రావాలని కోరారు. కాషాయ కండువా కప్పుకునే అంశంపై ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయనతో కాస్త గట్టిగానే చర్చలు జరుపుతున్నారు. మరి ఈటెల ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version