రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్సే లేదు – ఈటల రాజేందర్‌

-

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్సే లేదన్నారు మల్కాజ్‌ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ లో రోడ్ షో పాల్గొన్న ఈటల రాజేందర్…అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు 66 హామీలు 420 సమస్యలు… మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటీ అమలు కాలేదని ఆగ్రహించారు.

మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అది అవుతదా మీరే ఆలోచించండి అని కోరారు. ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతమవుతున్న చెరువులు, సిమెంట్ రోడ్లు, పేదలకు సొంతింటి కల ఇవన్నీ నెరవేర్చే శక్తి, అధికారం బిజెపికి మాత్రమే ఉందని తెలిపారు.

దేశమంతా ఒకటే నినాదం మరోసారి మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, 400 సీట్లు గెలిపించాలని సంకల్పంతో ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ గారు ఉంటే ఇక్కడ మీరు నన్ను గెలిపిస్తే ఎవరి మధ్యవర్తం లేకుండా, ఎవరి పైరవీ లేకుండా నేరుగా పోయి అన్న మల్కాజ్గిరి కి ఈ సమస్యలు పరిష్కరించండి అంటే పరిష్కరిస్తాడా లేదా మీరే చెప్పండన్నారని వివరించారు ఈటల రాజేందర్.

నాకు తెలిసింది రెండే విద్యలు… ఒకటి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ప్రజల్ని మోసగించిన వాళ్లపైన పోరాటం చేసే విద్య 14 ఏళ్లుగా నేర్చుకున్న. మన ప్రభుత్వమే వస్తది కాబట్టి ప్రజల సమస్యలు తీర్చి దాంట్లో నేనే ముందుంటా కాబట్టి రామంతపూర్ లో ప్రజలందరూ ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మరొకసారి ధర్మాన్ని, న్యాయాన్ని, సనాతన సంప్రదాయాన్ని, స్వేచ్ఛని, అభివృద్ధిని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version