ఈటల ‘ఎటాక్’..పాత మ్యాటర్ లాగి..!

-

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్..సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి..బీజేపీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే..మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంకా కొనుగోలుకు ప్రయత్నించిన అంశాలపై వీడియోలు చూపించారు. అబ్బో ఇంకా తానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్లు చెప్పుకొచ్చేశారు. అయితే కేసీఆర్ మీడియా సమావేశం ఓ కామెడీ షో అని, కిరాయి అరెస్టులని పెట్టుకుని ఓ సినిమా నడిపించారని, అదొక జబర్దస్ట్ స్కిట్ లా ఉందని చెప్పి కమలం నేతలు ఫైర్ అయ్యారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

ఇక ఈ విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు కూడా వచ్చాయి..కేసీఆర్‌కు కౌంటర్లు గట్టిగా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్‌పై ఫైర్ అవుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేసీఆర్ వ్యవహారం కొండను తవ్వి ఎలుకని పట్టుకున్నట్లు ఉందని, రోహిత్ ఏమి నీతివంతుడు కాదని, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని, అలాంటి వారు తమపై మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేలని చేర్చుకోవాలంటే తాము లేమా? స్వామీజీలు కావాలా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలని లాగి ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ ప్రజస్వామ్యం గురించి సిగ్గుచేటు చర్య అని అన్నారు.

అలాగే తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తున్నామని, కానీ ఆ నైతిక విలువలు లేకుండా కేసీఆర్..ఎంతమంది ఎమ్మెల్యేలని లాకున్నారో తెలుసని ఫైర్ అయ్యారు. తన కుమార్తె లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వడం ఖాయమని, అందుకే కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నారని బండి అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు.

ఇక బండి, కిషన్‌ల బాటలోనే ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ..కేసీఆర్‌ని ఏకీపారేశారు. పైగా 20 ఏళ్ళు పైనే కేసీఆర్ దగ్గర పనిచేశారు కాబట్టి..పాత విషయాలని బయటకు లాగి మరీ విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో 2014 నుంచి కాంగ్రెస్, టి‌డి‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని ఎలా టీఆర్ఎస్‌లోకి లాగారో తెలుసని అన్నారు.

వేరే పార్టీ గుర్తు మీద గెలిచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కేసీఆర్ అని, అలాగే పెద్ద పెద్ద మీడియా సంస్థలని బెదిరించి తన గుప్పిట్ళో పెట్టుకున్నారని, కాంగ్రెస్ హయాంలో కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఉండేదని, ఏదైనా కార్యక్రమాలు జరిగినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఆహ్వానించేవారని, కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలని చంపేస్తూ..ఓ నియంతల పాలిస్తున్నారని, హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడులో అదే రిపీట్ అవుతుందని అన్నారు. మొత్తానికి ఈటల కూడా గట్టిగానే కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version