యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. యూజీసీకి నా అభినందనలు : ఎంపీ లక్ష్మణ్‌

-

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. యూజీసీకి అభినందనలు తెలిపారు రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్. ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. అందులో.. అణగారిన వర్గాల సాధికారతకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల దేశంలోని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాలేదు. గౌరవ ప్రధానమంత్రి అలాంటి లోపాలను క్రమంగా సవరిస్తున్నారు. అందులో భాగంగానే డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని యుజిసి నిర్ణయం తీసుకుంది.

అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్‌ గారికి, యూజీసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో సుమారు 423 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, వాటితో పాటు మరో 130 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కో యూనివర్సిటీ ప్రతి ఏడాది సగటును 3,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తే, మొత్తం 16 లక్షల మందికి అడ్మీషన్ పొందుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 8 లక్షల మంది విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోతున్నారు.

 

 

తెలంగాణ ప్రభుత్వం కూడా యూజీసీ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న 10కి పైగా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీల్లో సుమారు 30,000 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 15,000 సీట్లు కోల్పోయారు. రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్ల సదుపాయాన్ని విస్మరించింది. UGC ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుండే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ అమలు చేసేలా అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version