కేసీఆర్ గారూ భూకంపాలు వద్దు కానీ… తెలంగాణ వచ్చి రైతుల ధాన్యాన్ని కొనండి: ఈటెల రాజేందర్

-

కేసీఆర్కు వ్యవసాయం అన్న లేక్కలేదు.. వ్యవసాయం శాస్త్రవేత్తల అన్నా లేక్క లేదని అన్ని నాకే తెలుసు అనుకునే వ్యక్తి కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. 24 గంటల్లో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నారని…. అంతపెద్ద మాట అక్కర్లేదని.. తెలంగాణ వచ్చి 20 లక్షల్లో పండించి వడ్లను రూ. 5 వేల కోట్లు ఖర్చుపెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్రానికి బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూట్ల రాయి తీయని వాడు ఏట్ల రాయి తీసినట్లుగా నీ వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు. కేసీఆర్ చిల్లర మాటలు, చిల్లర భాషను తెలంగాన ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు ఈటెల. తెలంగాణ వచ్చిన మొదట్లో రూ.3000లతో కేంద్రం కొనుగోలు చేసిందని…. 2020-21లో రూ. 26,000 కోట్లతో రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని ఈటెల అన్నారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని… తెల్ల బియ్యం ఇస్తామని లేఖ ఇచ్చింది నిజం కాదా….? అని ప్రశ్నించారు. భూకంపం సృష్టించే నీవు మెడ మీద కత్తి పెడితే ఉత్తరం ఇస్తావా.. అని ఎద్దేవా చేశారు. రైతుల గోస కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి కాదని… కేసీఆర్ కే రైతుల గోస తగులుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version