ఇటీవల కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేత ఈటల రాజేందర్ భేటీ సంచలనంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో ఈటల బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపించాయి.ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఈటెల రాజేందర్ ఖండించారు.
గతేడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చెందాడు. అప్పట్నుంచి ఈటల మౌనంగా ఉంటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనక పోవడం తో ఈటల పార్టీ మారబోతున్నారని వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలతో లంచ్ చేస్తున్న ఫొటోలు బయటకు రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆ ఫొటోలను చూపిస్తూ ఈటల కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం ఎక్కువయ్యింది. ఈ క్రమంలో ఈటెల రాజేందర్ స్పందిస్తూ…..కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఓ కార్పొరేటర్ గృహప్రవేశ కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని.. ఆ ఫోటోలు పట్టుకొని నాపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని అసహనం వ్యక్తం చేశారు.