కాంగ్రెస్ గెలిస్తే ఉద్యోగాలు రావని మా వాళ్లు చెప్పినా వినకుండా గెలిపించా : వీఆర్ఏ అభ్యర్థి

-

తమకు ఉద్యోగాలకు ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మోసం చేశారని వీఆర్ఏ అభ్యర్థి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు న్యాయం చేయాలని మంగళవారం వారు ధర్నా కార్యక్రమం చేపట్టగా పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలోనే ఓ అభ్యర్థి పోలీసు బస్సు నుంచి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు రావని, అయినా నేను వినకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాడి గెలిపిస్తే..మా వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైంది.మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.కానీ, ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజాపాలన.80 రోజులు సమ్మె చేసి తెచ్చుకున్న G.O ఇంప్లిమెంట్ అవ్వడానికి మేము మళ్లీ కొట్లాడవలసి వస్తుంది’ అని తన ఆవేదన వెల్లగక్కారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version