రాష్ట్రంలో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నడుస్తున్నది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలోనే ఉదయం సభా ప్రారంభం కాగానే రెండు నిమిషాల్లోనే సభను మంత్రి శ్రీధర్ బాబు వాయిదా వేశారు. దీంతో అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తాజాగా స్పందించారు.
బీఆర్ఎస్ పార్టీని మేము పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాలి కదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాకపోతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్‌ను పరిగణలోకి తీసుకోబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.