వయసు పెరిగినా..డిమాండ్ తగ్గట్లేదే.. టబు పారితోషకం తెలిస్తే షాక్..!!

-

టాలీవుడ్ సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి అందాల తార టబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె నాగార్జునతో కలిసి నటించిన సినిమాల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక తన అందంతో ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగుతోపాటు హిందీ, మలయాళం, ఉర్దూ, తమిళ్, ఇంగ్లీష్ , మరాఠీ , బెంగాలీ వంటి పలు భాషా చిత్రాలలో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇకపోతే నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుంది.

ఇక వయసు పెరిగినా కూడా ఈమె డిమాండ్ మాత్రం తగ్గట్లేదు అని తెలుస్తోంది. 1991లో కూలి నెంబర్ వన్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. ఏడాదికి ఆరు సినిమాలంటూ మొత్తం 75 చిత్రాలకు పైగా నటించి స్టార్ హీరోలలో కూడా మంచి అవకాశాలను అందుకుంది. ఇక ఇప్పటికీ కూడా వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈమెపై గతంలో పలు రూమర్లు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికీ కూడా నాగార్జున వల్ల వివాహం చేసుకోకుండా ఉండిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక నిన్నే పెళ్ళాడుతా సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ బాగా కుదిరిందని, అక్కడి నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది అని.. ఇక నాగార్జున పై ఉన్న ప్రేమ కారణంగానే పెళ్లి చేసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా ఆమె కోసం అక్కడ మేకర్స్ కూడా ఎంత పారిపోషకమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అంతేకాదు తాను అడిగినంత పారితోషకం ఇచ్చే వారికే ఆమె డేట్స్ ఇస్తుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుమారుగా రూ.2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version