నిర్మాతతో కోట్ల రూపాయలు తీసుకొని విదేశాలకు జంప్ అయినా హీరోయిన్..!!

-

ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ కొన్నిచోట్ల పెట్టుబడులు పెట్టి పలు రకాలుగా మోసపోయామని తెలిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొంతమంది లైంగిక వేధింపులలో మోసపోతూ ఉంటారు. మరి కొంతమంది పలు విషయాలలో మోసపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సినిమాలలోకి హీరోయిన్గా చేస్తామని అమ్మాయిలకు అవకాశాలు ఇస్తామని ఎంతోమంది మోసం చేసే వాళ్ళు ప్రతిరోజు పుట్టగొడుగుల పుట్టుకొస్తూనే ఉన్నారు.

అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు సినిమాలు లేక డబ్బులు లేక ఏదో ఒక సినిమాల్లో నటిస్తానని చెప్పి నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకొని నటించకుండా మోసం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది నిర్మాతలు కూడా హీరో హీరోయిన్ లకు సినిమా పూర్తి అయ్యాక రెమ్యూనరేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటారు. ఇలా పలు రకాల మోసాలు ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక హీరోయిన్ ఒక సినిమాలో నటిస్తారని ఒక బడా నిర్మాత దగ్గర పారితోషకం తీసుకొని మోసం చేసిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే..ఒక నిర్మాత ఒక హీరోయిన్ దగ్గర సినిమాలో నటించాలని ఆమె దగ్గర నుంచి అగ్రిమెంట్ రాయించుకున్నారట. అయితే హీరోయిన్ మాత్రం పక్కా ప్లాన్ వేసి ముందుగా ఆ నిర్మాత నుండి పారితోషకం తీసుకొని అక్కడి నుంచి విదేశాలకు ఎస్కేప్ అయ్యేవిధంగా ప్లాన్ వేసుకున్నదట. ఆ నిర్మాతతో ముందుగానే కోట్లల్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం.. దీంతో ఆ నిర్మాత చేసేదేమీ లేక పారితోషకం కోట్లల్లో ఇచ్చారట. అయితే అలా ఇచ్చిన తర్వాత ఆ హీరోయిన్ నటించడానికి సినిమాలకు రాకుండా ఉండడంతో ఆ నిర్మాతకు అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేయగా.. విదేశాలకు పారిపోయిందనే విషయాన్ని ఆమె సన్నిహితుల ద్వారా తెలుసుకున్నారట. దీంతో ఆ నిర్మాత మోసపోయానని తెలుసుకొని షాక్ అయ్యారు. అయితే ఆ నిర్మాత ఎవరు ఆ హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version