ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం తమ భూములు లాక్కుంటుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం మా భూములు లాకున్నారు.మా పక్కన రేవంత్ రెడ్డి మేనమామ భూమిని ఎందుకు తీసుకోవడం లేదు?. మా భూమి 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి మేనమామ భూమి 50 ఎకరాలు ఉంటే అది మాత్రం ముట్టుకోవట్లేదు.
మాకు చెప్పకుండా మా పొలాల్లో కడ్డీలు పాతారు.ఇదేంటని అడిగితే మా మెడలు పట్టి దొబ్బేశారు.మేము ఆత్మహత్యాయత్నం చేసుకుంటే రెవెన్యూ మేడం పిలిచి, మీరు ఏం చేసుకున్నా.. మీ భూములు తీసుకుంటామని చెప్తుంది.మాకున్నది ఈ భూమి మాత్రమే..మాకు న్యాయం చేయకుంటే మేము పెట్రోల్ పోసుకొని చనిపోతామంటూ’ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిడాల రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
https://twitter.com/TeluguScribe/status/1899324804202721362