వారానికి ఒక టిన్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ తాగినా.. క్యాన్సర్‌ ముప్పు ఉన్నట్లేనట..

-

మనకు ఆరోగ్యానికి ఏది మంచిదో.. ఏది మంచిది కాదో బాగా తెలుసు.. కానీ వాటిని వదులుకోలేం.. అసలే సమ్మర్‌.. ఎండ తాపాన్ని తట్టుకోలేక.. కూల్‌డ్రింక్స్‌ తాగుతుంటారు.. అది తాగినప్పుడు బానే ఉంటుంది. ఈ శీతలపానియాల్లో.. షుగర్‌ లెవల్స్ ఘోరంగా ఉంటాయి. చక్కెర వినియోగం పెరిగితే ఆరోగ్యానికి ప్రమాదమని కూడా మనకు తెలుసు.. సాఫ్ట్ డ్రింక్‌లో మోతాదుకు మించి చక్కెర ఉంటుంది. దీని వినియోగం వల్ల 45 రకాల విభిన్న అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని యూస్, చైనాకు చెందిన నిపుణులు హెచ్చిస్తున్నారు. ముఖ్యంగా మనం స్టైల్‌గా తాగే.. టిన్స్‌ వారానికి ఒకటి తాగినా..ప్రమాదమేనట..!

శీతల పానీయాల క్యాన్‌లు ఇతర సాఫ్ట్ డ్రింక్ ప్యాక్‌లు, ఇతర చక్కెరలు అధికంగా ఉన్న పదార్థాల ప్యాక్‌ల మీద చట్టబద్ధమైన హెచ్చరికలు రాయాలేమో. వారానికి ఒకటి కంటే ఎక్కువ క్యాన్ల సాఫ్ట్ డ్రింక్స్ వినియోగించే వారు ప్రాణాంతక ప్రమాదాల బారిన పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటిలో డయాబెటిస్ నుంచి టూత్ కావెటీ వరకు రకరకాల అనారోగ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. చక్కెర మోతాదు రోజుకు ఆరు టీస్పూన్లకు మించకుండా జాగ్రత్త పడాలనేది ఈ అధ్యయన సారాంశం. ఆరు టీస్పూన్లు దాదాపు 25 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఇంత చక్కెర నాలుగు కిట్ క్యాట్ ముక్కలు, సుమారు 150 మి.లీ.ల పండ్ల రసంలో ఉండే చక్కెరకు సమానం.

ప్రతి రోజు తీసుకునే ఒక్కో సాఫ్ట్ డ్రింక్ కరోనరీ హార్ట్ డీసీజ్ వచ్చే ప్రమాదం 17 శాతం, గౌట్ 4 శాతం, మరణాని దగ్గరయ్యే ప్రమాదం 4 శాతం వరకు పెంచుతుందని తెలియజేస్తున్నారు. డయాబెటిస్, స్థూలకాయం వంటి మెటబాలిక్ సమస్యలకు డైటరీ షుగర్ వాడకానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా నిర్ధారిస్తున్నారు. బీపీ, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలతో పాటు రొమ్ము, ప్రొస్టేట్, పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో సహా దాదాపు ఏడు క్యాన్సర్లకు కూడా మోతాదు మించిన డైటరీ షుగర్ వాడకం కారణం కావచ్చని గట్టిగా చెబుతున్నారు.

పండ్లు, పండ్ల రసాల్లో సహజంగా లభించే చక్కెర ఫ్రక్టోజ్. ఇది కూడా అదనంగా తీసుకునే ప్రతి 25 గ్రాములు 22 శాతం పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. చక్కెర వినియోగం రోజుకు 25 గ్రాములకు మించకుండా జాగ్రత్త పడడం ఉత్తమం..

Read more RELATED
Recommended to you

Exit mobile version