హనుమకొండ జిల్లా లో మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరురి రమేష్ మాట్లాడుతూ..కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేంద్రం దోచుకోవాలని చూస్తోందన్నారు.పాలు, పెరుగు, తినే వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు.డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలతో ఇప్పటికే సామాన్యుని నడ్డి విరుస్తున్నారనీ మండిపడ్డారు.తెలంగాణలో వరదలు వస్తె కనీసం రూపాయి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యధిక పన్నులు ఇస్తున్న రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వట్లేదని అన్నారు.తెలంగాణలోని వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.నిత్యావసర సరుకులపై జీఎస్టీ విదింపుకు నిరసనగా టీఆర్ఎస్ అధ్వర్యంలో నిరసనలు జరుపుతామని తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..రైస్ మిల్లర్ల పై బిజెపి ఎంపీ అరవింద్ మాటలు ఖండిస్తున్నామన్నారు.తెలంగాణలో వ్యవసాయం కేంద్రంగా పాలన సాగుతోందన్నారు.48 రోజులుగా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కొనట్లేదని తెలిపారు.
భారీ వర్షాలకు మిల్లుల్లోని వరి ధాన్యం మొలకలు వస్తోందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.పంట మార్పిడికి సిద్ధమైన రైతులతో వరి వేయించింది బీజేపీ నేతలేనని అన్నారు.బ్యాంకుల్లో అప్పులు తెచ్చి కేసిఆర్ వరి ధాన్యం కొనుగోలు చేశారనీ తెలిపారు.బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.