మనకు అరటిపండ్లలో ఆకుపచ్చరంగు అరటిపండు తెలుసు..ఇంకా చక్రకేళీ, చక్రపాణి అంటూ రకరకాల పండ్లు ఉంటాయి. ఆకలేసినప్పుడు అలా రెండుమూడు అరటిపండ్లు లాగిస్తే చాలు,ఆకలి నుంచి ఉపసమనం పొందవచ్చు. ఇంకా దీన్ని తినటం కూడా చాలు తేలిక..ఈజీగా అలా పైన తోలు తీసి తినేయెచ్చు.మిగతావి అంటే చాలా టైం పడుతుంది. పైగా అరటిపండులో యాంటీ ఆక్సజిడెంట్స్ ఎక్కువ. కానీ బ్లూకలర్ ఉన్న అరటిపండుని మీరు ఎప్పుడైనా చూశారా. వీటిని తినటం వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే మీకు షాక్ అవుతారు కూడా..
నీలి అరటిపండ్లకు చల్లటి ప్రాంతాలలో, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో దిగుబడి బాగుంటుంది . వీటి రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుందట. ఈ అరటిని ఆగ్నేయాసియాలో పండిస్తారు. హవాయి దీవులలో కూడా ఈ రకం అరటి తోటలు ఉన్నాయి. ఇంకా ఈ నీలం రంగు అరటిని దక్షిణ అమెరికాలో కూడా పండిస్తారు. అరటిని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, లూసియానాలో కూడా ఎక్కువగా పండిస్తారు.
దీని రుచి అచ్చం వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందట . ఈ అరటిని ‘బ్లూ జావా’ అరటి అని అంటారు. నీలం రంగు అరటిని కెర్రీ, హవాయి అరటి, ఐస్ క్రీమ్ అరటి అని కూడా అంటుంటారు. ఈ అరటికాయ పొడవు 7 అంగుళాల పొడవు ఉంటుందట. ఈ నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్ అని చెప్పవచ్చు ఎందుకంటే… ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్‌బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే ఈ హైబ్రిడ్ నీలం రంగు బనానా.
తింటే లాభాలేంటో తెలుసా..!
ఇవి సాధారణ అరటిపండ్లకంటే ఎక్కువరోజులు తాజాగా ఉంటాయట. దీనిలోపల నల్లగింజలు ఉంటాయట. దీనిలో పోటాషియంతో పాటు ఇతర ఖనిజాలు కూడా ఉండటంతో ఇది మంచి స్నాక్ ఐటమ్ గా తినేయొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
అరటిపండును 100 గ్రాములను తీసుకుంటే దానిలో ఫ్యాట్ 0.3 గ్రాములు, 89 కేలరీలు, కార్బోహైడ్రేట్స్ 22.8 గ్రాములు ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు వల్ల కూడా బాగా ఉపయోగాలు ఉన్నాయంట.. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ ఆకులను వాడవచ్చట.
కానీ, జలుబు, దగ్గు ఉన్నవారు ఈ అరటిపండుని తినకపోవడం మేలంటున్నారు నిపుణులు. ఈ అరటిపండు మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి బాడీని మరింత చల్లగా చేస్తుంది. కాబట్టి ఫలితంగా మనకు దగ్గు, జలుబు పెరుగుతాయి. మిగిలినవారు ఈ అరటినితింటే మాత్రం మంచి అనుభూతిని పొందట కాయం. ఇండియాలో ఎలాగో అందుబాటులో లేవు..ఇతరదేశాల్లో మీకు ఎప్పుడైనా కనిపిస్తే టేస్ట్ చేయటం మాత్రం మానకండి.!
– Triveni Buskarowthu