సీఎం జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో కొత్త పద్దతిని తీసుకువచ్చారు. రెండున్నర ఏళ్ళు కొందరు మంత్రులుగా ఉంటారు, ఆ తర్వాత కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తామని కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా మొదటిసారి అయిన మంత్రులలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. మంత్రిగా ఉండగా బాగానే ఉన్నారు.. పార్టీలోనూ మంచి గౌరవమర్యాదలు దక్కాయి. కానీ రెండవ మంత్రివర్గం జరిగిన తర్వాత బాలినేని తీయగానే.. అక్కడి నుండి మనసులో తీవ్ర అసంతృప్త జ్వాలలతో ఉంటూ వచ్చారు. చాలా సార్లు తన సన్నిహితుల దగ్గర నాకు మంత్రిగా లేనప్పటి నుండి పార్టీలోనూ , ప్రభుత్వ అధికారుల వద్ద సరైన గౌరవం లేదు, నా మాటకు విలువలేదంటూ బాధపడుతూ వచ్చారట. ఇక తాజాగా తన వద్ద ఉన్న ఇద్దరు గన్ మెన్ లను సైతం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని తాడేపల్లిలో సీఎం ఆఫీస్ కు వచ్చారు.. ఇక్కడ సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డితో అన్ని విషయాలను చర్చించారట.
ఆ ఆతర్వాత సీఎం జగన్ ను కలిసి తన బాధలను చెప్పుకున్నారట.. మరి అలకతో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమి చెప్పారు ? ఇక ఆయన మాములుగా ఉంటారా ? అసలు ఏమి జరగనుంది అన్నది తేలియాలనంటే ? బాలినేని బయటపెట్టాల్సి ఉంది.