స్పిరిట్ చావులు అలా అర్ధమయ్యాయా నాయనా?

-

బీర్ హెల్త్ డ్రింక్ అని అభాసుపాలయ్యి, మహళలతో మామూలుగా తిట్టిచ్చుకోని మాజీ మంత్రి జవహర్ మరోసారి మద్యం విషయంలో మైకులముందుకు వచ్చారు. స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని ఆరోపిస్తూ.. కశింకోటలో జరిగిన మరణాలకు జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను పెంచారని, అందుకే జనం స్పిరిట్ తాగి చనిపోతున్నారని.. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతున్నారని తనదైన శైలిలో స్పందించారు. అసలు ఈ కశింకోట వ్యవహారం ఏమిటి.. ఈ టీడీపి నేతలకు ఏమైనా అర్ధం ఉందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం!

విశాఖ జిల్లాలో కశింకోట గోవిందరావు కాలనీలో మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముందుగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్‌ రావ్‌ స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. మద్యం కంంటే మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ ను తీసుకొని రెడీ అయ్యారు. ఈ పార్టీలో ఆరుగురు పాల్గొనగా.. నలుగురు స్పిరిట్‌ తాగారు. కాగా తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. అనంతరం మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మృతుల్లో ఒకరు మందుల కంపెనీలో కార్మికుడు కావడంతో అక్కడి నుంచి గుట్టుగా సర్జికల్‌ స్పిరిట్‌ తీసుకొచ్చాడని తెలుస్తుంది. ఇది జరిగిన వ్యవహారం!

దీనిపై స్పందించిన టీడీపీ నేత… ఏపీలో మద్యం ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో చిచ్చు పెడుతుందని.. ఈ మరణాలకు జగన్ బాధ్యత వహించాలని డిమాడ్ చేస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని… టీడీపీ వ్యవాస్థాప అధ్యక్షుడు ఎన్ టీఆర్ నాడు ఎలాగైతే చెప్పారో, అదే స్థాయిలో వారి ఆశయాలను టీడీపీ వదిలేసినా, జగన్ నెరవేర్చ నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే బెల్టు షాపులు ఎత్తేయడం, మద్యం షాపుల సంఖ్యను కుదించడం, ముట్టుకుంటే కాలేలా మద్యం ధరలు పెంచడం చేసుకుంటూపోతున్నారు. ఇది దశల వారీగా మద్య్పాన నిషేదానికి జగన్ సర్కార్ ఎంచుకున్న మార్గం!

ఇవన్నీ జనాలకు తెలియంది కాదు, ప్రతిపక్షాలకు అసలే తెలియంది కాదు. కానీ… అధికమత్తు కోసం స్నేహితులంతా కలిపి మందుల కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడితో స్పిరిట్ తెచ్చుకోవడం ఏమిటి? దానికి జగన్ సర్కార్ ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో చిచ్చుపెట్టడం ఏమిటి? ఆ లాజిక్.. బీర్ ని హెల్త్ డ్రింక్ గా భావించిన జవహార్ కే తెలియాలి? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పాల్సిన నేతలే ఇలా.. మద్యం ధరలు పెంచారని, మద్యం లేక ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో జగన్ చిచ్చుపెడుతున్నారని… అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడటం ఏమిటి?

Read more RELATED
Recommended to you

Exit mobile version