ఒక మాజీ సైనికుడి కొడుకు పేరు సుదీప్ రానా… అతను దుబాయ్ లో నివాసం ఉంటూ ఒక షాపింగ్ మాల్ లో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నాడు. ఈ తరుణంలో ఈ నెల 2 న అతను పని చేస్తున్న షాప్ కి ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ షాపింగ్ చేసింది. అయితే బిల్లు కట్టే సమయంలో ఆమె ఒక పని చేసింది. తన చేతిలో ఉన్న ఒక ఎన్వీలప్ కవర్ ని క్యాష్ కౌంటర్ వద్ద మర్చిపోయింది.
క్యాష్ కౌంటర్ పరిసరాలను సుదీప్ క్లీన్ చేస్తున్నాడు. ఇంతలో అతనికి ఆ కవర్ కనపడింది. దాంట్లో డబ్బు ఉందని అతను గమనించాడు. ఎంత డబ్బు ఉంది ఏంటీ అనేది లెక్క చూడకుండా తన పై అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజీ సహాయంతో ఆ మహిళను గుర్తించారు. తర్వాత ఆ మహిళ సమాచారం తెలుసుకుని ఆమెకు ఆ కవర్ ఇచ్చాడు.
ఇంతకు ఆమె ఎంత సొమ్ము ఉందనుకుంటున్నారు. సుమారు 20 వేల దిర్హామ్స్ (రూ.3,87,336) విలువ గల ఎన్వలప్ కవర్‌ను కౌంటర్ వద్ద మర్చిపోయింది. పోలీసులు అతని నిజాయితీ చూసి ఆశ్చర్యపోయారు. స్టోర్ కీపర్ కు ఇంత నిజాయితీ ఉందా అని విస్తుపోయారు. అతడ్ని పిలిచి వివరాలు అడగగా తన తండ్రి మాజీ సైనికుడు అని, అందుకే తనకు డబ్బు మీద ఆశ ఉండదు అని చెప్పాడు.