సరిగ్గా ఏడాది కిందట నేటితో నియంత పాలనకు చరమగీతం : టీపీసీసీ చీఫ్

-

సరిగ్గా ఏడాది కిందట నేటితో నియంత పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వెలిగిపోతున్నదని అన్నారు. ఈ ఏడాది పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల మన్ననలు పొందిందని కొనియాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.సరిగ్గా ఏడాది కిందట రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలన ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా సహకరించారన్నారు. గడీల పాలన, ఫామ్ హౌస్ పాలనతో విసిగిపోయి, అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల నిర్ణయంతో నేడు రాష్ట్రం రైసింగ్ తెలంగాణగా దూసుకుపోతున్నదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version