సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటికీ చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. జూన్ ఒకటవ తేదీన చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఈ పోలింగ్ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌పోల్స్‌పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌పర్సన్ పవన్ ఖేరా ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేశారు.
పోలింగ్ ముగిసేసరికి ప్రజలంతా ఓటుహక్కుతో తమ నాయకులను ఎన్నుకొని ఉంటారు . వారి నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది. ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని, అలాంటప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఊహగానాలను ప్రచారం చేయడం ఎందుకని పవన్ ఖేరా ప్రశ్నించారు. జూన్ 4న ఎలాగో ఫలితాలు విడుదలవుతాయి. అప్పుడు ఎవరు విజేతగా నిలుస్తారు అనేది తెలుస్తుంది. అందుకే జూన్ 4 తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుంది” అని ఆయన తెలిపారు.