కల్లు సీసాలో కట్ల పాము కలకలం

-

కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. దీంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు స్థానికులు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో.. ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కట్ల పాము పిల్ల కనిపించింది.

A Man snake found in a bottle while a man was drinking kallu

దీంతో వెంటనే సీసాను పడేయడంతో ప్రాణాపాయం తప్పింది. లేకపోతే.. ఆ పాము అటాక్‌ చేసి ఉండేది. ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version