పారిశ్రామికవేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ శిల్పా కళా వేదికలో నూతన MSME పాలసీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడేలా నాటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోరని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేందుకు కొత్తగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన చేపట్టామని తెలిపారు. మూసీ అంటే మురికి కూపం కాదని నిరూపిస్తాం. ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసే విధంగా మూసీని తయారు చేస్తామన్నారు. అమెరికా, లండన్ మాదిరిగా నదులను తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్టు వెల్లడించారు.