చంద్రబాబు వరుసగా ఎందుకు సీఎం కాలేకపోతున్నారు..? రీజన్ అదేనా..?

-

ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద చంద్రబాబునాయుడు సీనియర్ నాయకులు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.. ఎన్డీఏ హయాంలో కేంద్రంగా కీలకంగా వ్యవహరించారు.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.. ఆయన అంత సీనియర్ అయినా.. ఆయన చుట్టూ ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. వరుసగా రెండు సార్లు సీఎంగా ఆయన ఎప్పుడూ పనిచెయ్యలేదని పొలిటికల్ సర్కిల్ లో తెగ చర్చ నడుస్తోంది..

తెలుగు రాష్ట్రాలలోనే చూస్తే వైఎస్సార్ వరుసగా రెండు సార్లు సీఎం గా గెలిచారు. కేసీఆర్ కూడా రెండు సార్లు సీఎం వరసగానే అయ్యారు. ఇక దేశంలో చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వరసబెట్టి గెలుస్తూ వస్తున్నారు. బీహార్ లో చూస్తే నితీష్ కుమార్ వరసగా గెలుస్తూ ముఖ్యమంత్రి పీఠం మీద కంటిన్యూ గా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి యూపీ సీఎం గా వరసగా రెండు సార్లు గెలిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు వరుసగా పార్టీని అధికారంలోకితీసుకొచ్చి.. సీఎం పదవిని అధిరోహించారు..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దతును కూడగొట్టుకుని చంద్రబాబునాయుడు 1995లో సీఎం అయ్యారు.. ఎన్టీయార్ తీసుకొచ్చిన అధికారాన్ని ఆయన ఎనిమిది నెలలు పాటు అనుభవించారు.. అనంతంర ఆయన సారధ్యంలో 1999 ఎన్నికల్లో గెలిచారు.. 2004,2009లో ఓటమి పాలయ్యారు.. 2014లో గెలిచిన బాబు.. 2019లో ఓడిపోయారు.. తర్వాత ఇప్పుడు సీఎంగా ఉన్నారు..

సింగిల్ గా పోటీ చేస్తే చంద్రబాబు గెలవలేరని రాజకీయ ప్రత్యర్దులు విమర్శిస్తుంటారు.. అది నిజమే.. ఆయన స్వంతంగా ఎన్నికలకు వెళ్లి గెలిచిన సందర్బాలు తక్కువ.. 2014, 2024లో అంతకు ముందు కూడా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు.. చంద్రబాబు నాయుడు వరసుగా గెలవకపోవడానికి కారణాలు కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు సరిగా అమలు చెయ్యరని.. అందుకే రెండోదఫా ఎప్పుడూ ఆయన సీఎం కాలేదని చెబుతున్నారు.. ఈ రికార్డును చూసుకునే.. వచ్చె ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి బలంగా చెబుతున్నారనే రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version