గుడివాడ ఎస్సై సూసైడ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి !

-

కృష్ణాజిల్లా గుడివాడ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. నిజానికి కొద్ది రోజుల క్రితం గుడివాడ శివార్లలోని పేకాట శిబిరాల మీద దాడి చేసిన కేసులో ఈయన కూడా ఉన్నాడని ప్రచారం జరగడంతో ప్రభుత్వం నుండి ఒత్తిడి వల్లే చనిపోయాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఆత్మహత్యకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని తేల్చారు పోలీసులు.

విజయ్ కుమార్ సూసైడ్ చేసుకున్న సమయంలో అతని ఫ్లాట్లోనే ప్రియురాలు సురేఖ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. విజయ్ కుమార్ తో అక్రమ సంబంధం ఏర్పడిన నేపథ్యంలో భర్తకు విడాకులు ఇచ్చేసి విజయ్ కుమార్ తో కలిసి ఉంటుంది సురేఖ అనే బ్యూటీషియన్. అయితే నాలుగు నెలల క్రితం విజయ్ కుమార్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ వస్తోంది.

మొన్న రాత్రి తాను సూసైడ్ చేసుకుంటానంటూ సురేఖ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న విజయ్ కంగారు పడి తాను కూడా ఫ్యాన్ కి ఉరి వేసుకున్నాడు. అయితే బయటకు వచ్చి విగతజీవిగా ఉన్న విజయ్ ను చూసి కంగారు పడ్డ సురేఖ పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో సురేఖ మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version