వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీయడానికి కారణమైంది.కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గత నెల 25 తేదీన మమత తన కుమారుడు ధృవని తీసుకొని షాపుకి వెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. అయితే, అనుకోకుండా మమత మరణించింది.
కాగా, మమత చనిపోవడానికి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని తెలిసింది. మంచిర్యాల జిల్లాకి చెందిన భాస్కర్ సింగరేణిలో ఉద్యోగి. అతనికి మమతతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ క్రమంలోనే భాస్కర్ తన జీతం డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా మమతకే ఖర్చు చేసేవాడు. ఈ విషయం కాస్త భాస్కర్ ఇంట్లో తెలిసింది. దీంతో అతని కుటుంబ సభ్యులు మమత పై ద్వేషం పెంచుకుని ఓ వ్యక్తికి డబ్బు ఇచ్చి మమతను హత్య చేయించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.