నలుగురు మావోయిస్టు పార్టీ దళ సభ్యులు అరెస్ట్

-

మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు దళ సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల సీఐ రాజు వర్మ వెల్లడించారు. శుక్రవారం ఉదయం సీఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి ఎసై నర్సిరెడ్డి తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న పాలిథిన్ కవర్లను స్వాధీనం చేసుకుని చూడగా అందులో మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలు లభించినట్లు తెలిపారు.

అనంతరం వారిని విచారించగా వారు గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో దళ సభ్యులుగా పనిచేస్తున్నట్లు తేలిందని వివరించారు. ఛత్తీస్ గడ్  రాష్ట్రం పామేడు ఏరియా కమిటీ డివిసి ఐనా సుక్కి ఆదేశాల మేరకు కరపత్రాలు వేయడానికి వస్తున్నట్లు తెలిపారని అన్నారు. పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన గట్టుపల్లి ఊర, సుక్మా జిల్లాకు చెందిన మడకం ఉంగ సోడి సుక్కి, దంతేవాడ జిల్లా ఆలనర్ గ్రామానికి చెందిన కడితి లక్కే ఉన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version