హుజురాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత.. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి

-

హుజరాబాద్ నియోజకవర్గం లో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అభివృద్ధిపై చర్చకు రావాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరారు. ఈటలకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. అయితే చర్చకు ఈటల అవసరం లేదని.. కౌశిక్ రెడ్డి స్థాయికి తాము వస్తామని బిజెపి నేతలు ప్రతి సవాల్ విసిరారు. దీంతో హుజరాబాద్ లో పోటా పోటీగా టిఆర్ఎస్, బిజెపి పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.

 

అయితే చర్చకు వెళుతున్న బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని, ఇతర నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. చర్చకు వెళుతున్న తమను కావాలనే పోలీసులు అడ్డుకుంటున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక హుజురాబాద్ లోని టిఆర్ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా వచ్చారు కౌశిక్ రెడ్డి.

ఈ నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్దకు పెద్ద ఎత్తున బిజెపి, టీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version