ఎటువంటి రిస్క్ లేకుండా అతి కొద్ది రోజుల్లో లాభాలను పొందాలి అనుకోనేవాల్లకు కోళ్ల పెంపకం బెస్ట్ అని చెప్పాలి..అయితే కోళ్లు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక నెల రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.ఈ మాంసం కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఒకసారి చుద్దాము..
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిల్నాడు 45 శాతం గ్రుడ్ల ఉత్పత్తి చేస్తు న్నాయి. ఇక్కడ తలసరి గ్రుడ్లు వినియోగం 57 గ్రుడ్లు మరియు బ్రాయిలర్ కోళ్ళ మాంసం 0.5 కిలోలతో ఉంది. భారతదేశం యొక్క తూర్పు మరియు మధ్య ప్రాంతాలు గ్రుడ్ల ఉత్పత్తి 20 శాతం ఉండగా, తలసరి వాడకం 18 గ్రుడ్లు మరియు బ్రాయిలర్ కోడి మాంసం 0.13 కిలోలుగా ఉంది..
మనదేశంలో పౌల్ట్రీ రంగంలో అభివృద్ధి చెందింది..బ్రాయిలర్ కోళ్ళ ఫారాలు బ్యాచ్ కు 200-500 కోడి పిల్లలలో సగటున ఉత్పత్తి చేసింది. కాని ఇప్పుడు 5000 బ్రాయిలర్స్ కన్నా తక్కువ పక్షులతో ఫారాలు అరుదుగా ఉన్నాయి. ప్రతి బ్యాచ్ కు 5000 నుండి 50,000 పక్షులతో ఉన్న యూనిట్లు సర్వ సాధారం అయ్యాయి..
ఈ కోళ్ల పోషణకు 70% ఖరు దాణాపై పడును. బ్రాయిలర్ దాణాను 2 రకాలుగా తయారు చేస్తారు. ఈ కోళ్ళ పెరుగుదల కూడా ఈ దాణా యెక్క పోషక విలువల మీద ఆధారపడి ఉంటుంది. కనుక దాణా పైన శ్ర చాలా అవసరం. బ్రాయిలరుల పెంపకంలో లాభాలు గడించాలంటే. మేత ఖర్చు తక్కువయేట్లు చూసుకోవాలి.బ్రాయిలర్ కోళ్ళకు ప్రత్యేకంగా తయారు చేయబడిన స్టార్టరు, ఫినిషర్ దాణాలనే వాడాలి. మెదటి 3 వారాల వరకు స్టార్టర్ దాణా. ఆ తరువాత ఫినిషరు దాణాలను ఇవ్వాలి. స్టార్టరు దాణాలో ప్రొటీన్స్ 22 శాత ౦ శక్తి కిలో దాణాకు 2900 కిలో కాలరీలు ఉండాలి. ఫినిషర్ దాణాలో ప్రొటీన్స్ 20 శాతం, శక్తి 3000 కి లోకాలరీలు దాణాకి ఉండేలా దాణాను తయారు చేసుకోవాలి. అప్పుడే బ్రాయిలర్ కోళ్ళ పెరుగుదల సరిగా ఉంటుంది..కోళ్ళ దాణాలో 1 లేదా 3 శాతం వ రకునూనె లేదా కొవ్వును వాడి దాణ వినియోగ సామర్ధ్యతను పెంచవచ్చు..ఈ కోళ్లకు రోగాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఒకవేళ తెగుళ్లు వస్తే వాటిని వేరు చెయ్యాలి.. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి..