రవితేజ ఇంటి నుంచి మరో హీరో..ఫస్ట్ లుక్ రిలీజ్

-

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలై అట్టర్‌ ఫ్లాఫ్‌ ను మూట గట్టుకుంది. అయితే.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నారు.

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ భూపతి రాజు హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన హీరోగా నల్లమలుపు శ్రీనివాస్‌ ఓ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రమేష్‌ వర్మ కథను అందించిన ఈ సినిమాకు లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమాకు ఏయ్‌ పిల్లా అనే టైటిల్‌ ను ఫైనల్‌ చేశారు. అలాగే హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఓ పోస్టర్‌ కూడా వదిలారు. పోస్టర్‌ తోనే యూత్‌ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ మూవీతో రుబల్‌ షెకావత్‌ తెలుగు తెరకు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version