సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు.
పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
RPF 9500 కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లను భర్తీ చేస్తోంది అని ఒక వార్త వచ్చింది. నిజంగా RPF 9500 కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లను భర్తీ చేస్తోందా..? ఇందులో నిజం ఇంతా అనేది చూస్తే.. RPF 9500 కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లను భర్తీ చేస్తోంది అనడం, పదవ తరగతి వాళ్ళు, పన్నెండవ తరగతి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనడం అంతా కూడా నకిలీ వార్తే.
कई न्यूज वेबसाइट्स की खबरों में यह दावा किया जा रहा है कि @RPF_INDIA ने कॉन्स्टेबल और असिस्टेंट सब इंस्पेक्टर के 9500 पदों पर वेकेंसी जारी की है #PIBFactCheck
▶️ यह खबर फ़र्ज़ी है
▶️ सही जानकारी के लिए RPF की आधिकारिक वेबसाइट https://t.co/wf2zlZjfoG पर जाएं pic.twitter.com/nrAhM9regY
— PIB Fact Check (@PIBFactCheck) October 12, 2022
ఈ వార్త వచ్చాక ఇన్వెస్టిగేషన్ చేసారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. RPF 9500 కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లను భర్తీ చేస్తోంది అనడం నకిలీ వార్త అని తేల్చేసింది. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. దీనిలో నిజం ఏమి లేదు.