Fact Check ‌: ఒక్కో ఉద్యోగికి కేంద్రం నిజంగానే రూ.1.20 ల‌క్ష‌లు ఇస్తుందా..?

-

ప‌త‌న‌మైన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రూ.20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ దేశంలోని చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ సంస్థ‌ల‌కు ఊతం ఇచ్చేలా ఆ ప్యాకేజీ లోంచి ప‌లు అంశాల‌ను వెల్ల‌డించారు. అయితే దీన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు ప్ర‌బుద్ధులు సోష‌ల్ మీడియాలో ఓ ఫేక్ వార్త‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అదేమిటంటే…

1990 నుంచి 2020 వ‌ర‌కు ప‌నిచేసిన ఉద్యోగుల‌కు కేంద్రం ప్ర‌త్యేకంగా రూ.1.20 ల‌క్ష‌ల‌ను ఒక్కొక్క‌రికి ఇస్తుంద‌ని.. ఓ వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని తేలింది. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి స్కీం దేన్నీ ప్ర‌క‌టించ‌లేద‌ని.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ద్వారా వెల్ల‌డించింది.

ఇక ఆ మెసేజ్ వ‌చ్చిన వారు దాన్ని న‌మ్మ‌కూడ‌ద‌ని, అందులో ఉండే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని అధికారులు చెబుతున్నారు. లేదంటే మోస‌గాళ్ల బారిన ప‌డాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version