మహమ్మారి వల్ల చాలా సమస్యలతో మనం ఇబ్బంది పడ్డాము. అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతోంది. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ ని కూడా వేయించుకోవడం జరిగింది అయితే కొంత మంది మాత్రం వ్యాక్సిన్ ని ఇంకా వేయించుకోలేదు. దీనికి గల కారణం..? వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయేమోనని. అయితే నిజంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయా..? నిజమెంత అనేది మనం చూస్తే…
వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వచ్చే రియాక్షన్స్ కేవలం కొన్ని రోజులు మాత్రమే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసిన ప్రదేశంలో నొప్పి కలగడం, తలనొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే వస్తాయి. అంతే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా రావు అని నిపుణులు అంటున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయని దీర్ఘకాలిక సమస్యలు రావని క్లియర్ గా కనిపించే సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 6.8 బిలియన్ మంది వ్యాక్సిన్ ని వేయించుకున్నారు.
ఇమ్మ్యూనోలజిస్ట్స్ చెబుతున్న దాని ప్రకారం దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నాయి అని పెద్దగా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవని అంటున్నారు అప్పటికప్పుడే రియాక్షన్స్ రావడం కానీ దీర్ఘకాలిక సమస్యలు రావు అని చెప్పారు. కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది పడకండి.