ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వమే ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని మొదలు పెట్టిందా..? నిజం ఏమిటి..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలామంది నకిలీ వార్తల వలన మోసపోతున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చాలా మంది వివిధ రకాల సమస్యల వలన ఆసుపత్రి బారిన పడతారు రక్తం అవసరం అవుతూ ఉంటుంది కూడా అటువంటప్పుడు దాతలు దొరికితే బ్లడ్ ని డొనేట్ చేస్తారు అలానే బ్లడ్ ప్యాకెట్స్ వంటివి దొరుకుతూ ఉంటాయి.

సోషల్ మీడియాలో 104 నెంబర్ కి కాల్ చేస్తే అవసరమైన వాళ్లకి రక్తం అందుతుందని ఉంది. మరి నిజంగా 104 నెంబర్ కి కాల్ చేస్తే రక్తం కావలసిన వాళ్ళకి అందుతుందా..? బ్లడ్
ఆన్ కాల్ అనేది నిజమేనా..? సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తోంది పైగా ఇది నిజమని చాలామంది షేర్ చేస్తున్నారు.

భారత ప్రభుత్వం పాన్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ ని తీసుకు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ షికార్లు కొడుతోంది. ఇది నిజమా కాదా అనే విషయానికి వస్తే ఇది వట్టి నకిలీ వార్త అని క్లియర్ గా తెలుస్తోంది. ఇది నిజం కాదు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది నిజం కాదని చెప్పేసింది. ప్రజలని తప్పుదారి పట్టించే వార్తలు ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి.

ఇటువంటి వాటిని గుర్తించి జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఇది మహారాష్ట్రలో మాత్రమే అందుబాటులో ఉంది పాన్ ఇండియా సర్వీస్ కాదు. జనవరి 2014లో మహారాష్ట్రలో దీనిని తీసుకొచ్చారు అంతే కానీ అన్ని చోట్ల ఇది పనిచేయదు. సో ఇది కేవలం నకిలీ వార్త అని గుర్తించి ఇటువంటి వార్తలకు దూరంగా ఉండండి లేకపోతే మీరు నష్టపోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version