ఫ్యాక్ట్ చెక్: ఆధార్ కార్డు ఉంటే మోదీ ప్రభుత్వం 2 శాతం వడ్డీతో రుణాలను కేంద్రం ఇస్తోందా..? నిజమెంత..?

-

మనకి ఉండే కీలకమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ అనేది అవసరం. ప్రభుత్వ స్కీముల ప్రయోజనాలు పొందడం మొదలు ఎన్నో వాటికి ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు లేకపోతే కొన్ని పనులు అవ్వవు. అయితే తాజాగా ఆధార్ కార్డు కి సంబంధించి ఒక వార్త వచ్చింది. ఇక దాని గురించి చూస్తే..

 

కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు పై రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రధానమంత్రి తీసుకొని వచ్చిన సరికొత్త పథకం కింద ప్రభుత్వం రెండు శాతం వడ్డీకి రుణాలను ఇస్తోందని ఆ మెసేజ్ లో ఉంది. అయితే నిజంగా ప్రభుత్వం ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తోంద..? దీనిలో నిజమెంత అనేది చూస్తే… ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి వార్తలు వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు పై ఎటువంటి లోన్ సదుపాయాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్సైట్ లో కూడా ఇలాంటి వార్తలు ఏమీ లేదు.

పైగా ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏమీ చేయలేదు అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనవసరంగా మోస పోవాల్సి వస్తుంది. వాస్తవం తెలియకుండా ఆ నకిలీ వార్తలని  అనవసరంగా షేర్ చేయడం వల్ల చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version