ఫ్యాక్ట్ చెక్: వివిధ పోస్టులను ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ భర్తీ చేస్తోందా..?

-

సోషల్ మీడియా చాలా అడ్వాన్స్ అయిపోయింది దీనితో మనం ఎలాంటి విషయాన్నైనా క్షణంలో తెలుసుకోవచ్చు. అదే విధంగా సోషల్ మీడియా వలన నకిలీ వార్తలు కూడా ఎంతో వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.

ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవాలి. లేదంటే అనవసరంగా ఫ్రాడ్స్టర్స్ చేతుల్లో చిక్కుకుంటారు. దాంతో ఇబ్బందుల్ని ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అది నిజమా కాదా అందులో నిజమెంత అనేది తెలుసుకుందాం.

తాజాగా ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ వివిధ పోస్టులను భర్తీ చేయడానికి అప్లికేషన్స్ ని ఇస్తోందని వార్త వచ్చింది. అయితే మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. పైగా ఒక వెబ్సైట్ లింక్ https://www.territorialarmy.in/ కూడా ఇచ్చారు. అయితే ఇది నిజమా కాదా అనేది చూస్తే…

ఈ నోటీసు నకిలీదని తెలుస్తోంది. ఇచ్చిన వెబ్సైట్ కూడా టెరిటోరియల్ ఆర్మీ కి సంబంధించినది కాదు. ఈ వెబ్సైట్ ని కేవలం ప్రజల్ని మోసం చేయడానికి క్రియేట్ చేశారు. కనుక దీనికి దూరంగా ఉండడం మంచిది. ఇటువంటి నకిలీ వార్తలు అనవసరంగా నమ్మి మోసపోవద్దు. ఇటువంటి ఫేక్ వెబ్సైట్లకి దూరంగా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version